బిగ్‌బాస్ ఎలిమినేషన్.! ఈ ట్విస్టేందో ఎవరికెరుక.!
- October 21, 2024
బిగ్‌బాస్ తెలుగు తాజా సీజన్‌లో నిజంగానే అనూహ్యమైన విశేషాలు చోటు చేసుకుంటున్నాయ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీల దగ్గరి నుంచే ఒకింత వింత పరిణామాలు చోటు చేసుకున్నాయ్.
ఇంతవరకూ ఏ సీజన్‌లోనూ లేని విధంగా ఫిఫ్టీ - ఫిప్టీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయ్. కాగా, ఎలిమినేషన్ల విషయంలోనూ అనూహ్యమైన పరిస్థితులే.
జరుగుతున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఎలిమినేషన్ల పర్వం నడుస్తోంది. గతంలో ప్రచారంలో వున్న పర్సన్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు. ప్రచారం అనేకన్నా.. ఒరిజినల్ లీకులో భాగమే అది అనుకోవచ్చేమో.
కానీ, ఈ సీజన్‌కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలీదు కానీ, లీకులకు భిన్నంగా ఎలిమిషన్లు జరుగుతున్నాయ్.
తాజాగా పృద్వీ ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరిగింది. కొంత మంది హరితేజను బయటికి పంపించేస్తున్నారట అనే ప్రచారం తీసుకొచ్చారు. కానీ ఈ రెండింటికీ భిన్నంగా మణికంఠను బిగ్‌బాస్ ఎలిమినేట్ చేశాడు.
అది కూడా చిత్రమైన పరిస్థితుల్లో. మణికంఠని అడిగి నువ్వు ఎలిమినేట్ అయిపోతావా.? అని తనతో పాటూ ఎలిమినేషన్‌లో వున్న గౌతమ్‌ని పక్కన పెట్టి మణికంఠకు అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చి చివరికి తన ఇష్టంతోనే బయటికి పంపించడం జరిగింది. ఈ విపరీతమైన పరిణామంతో వీక్షకులు బిత్తరపోయారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







