బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 4’ ముహూర్తం కుదిరింది.!
- October 21, 2024
వెండితెరపై నందమూరి నటసింహంగా ఎన్నో విజయాలను చవి చూసిన బాలకృష్ణ ఫస్ట్ టైమ్ హోస్ట్‌గా బుల్లితెరపైనా సత్తా చాటారు అన్‌స్టాపబుల్ రియాల్టీ షో ద్వారా.
మూడు సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన ఈ షో ద్వారా బాలయ్య తనలోని డిఫరెంట్ యాంగిల్‌ని బయటికి తీసే అవకాశం కుదిరింది. అలాగే, పవన్ కళ్యాణ్ తదితర స్టార్ హీరోలతో బాలయ్య చేసిన ఈ ప్రొగ్రామ్ మరింత ప్రజాదరణ పొందింది.
ఇక, ఇప్పుడు లేటెస్ట్ సీజన్ (అన్ స్టాపబుల్ 4) స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ 1న తొలి సెలబ్రిటీ షూట్ జరగబోతోంది. అయితే, ఫస్ట్ షోలో భాగంగా ఏపీ సీఎం, నారా చంద్రబాబు నాయుడు గారు హాజరు కానున్నారు.
అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ షో నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ ఆహా వేదికగా ఈ ప్రోగ్రామ్ స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.
అయితే, ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇంకా క్లారిటీ రావల్సి వుంది. మరోవైపు బాలయ్య తన 109వ చిత్రంతోనూ బిజీగా వున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే, ఇటీవలే బోయపాటి శీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







