చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా.?

- October 21, 2024 , by Maagulf
చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా.?

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ నీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ వుంటాయ్. ఇవి శరీరానికి తక్షణ శక్తినివ్వడంతో పాటూ, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ తోడ్పడతాయ్.

అందుకే కేవలం సమ్మర్‌లోనే కాదు, అన్ని కాలాల్లోనూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.

అయితే, సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వడదెబ్బ సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ, వింటర్‌లో కొబ్బరి నీళ్లను కాస్త మితంగా తాగాలని చెబుతున్నారు.

అది కూడా రాత్రి పూట అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగితే ప్రమాదాలు కొని తెచ్చుకోవడమే.

పగటి పూట తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శీతాకాలంలో ఇమ్యూనిటీ చాలా అవసరం. ఈ సీజన్‌లోనే ఎక్కువగా రోగాల బారిన పడుతూ వుంటారు.

అందుకే కొబ్బరి నీళ్లను పూర్తిగా అవైడ్ చేయకుండా కొద్దిగా తీసుకోవాలి. అది కూడా పగటి పూట మాత్రమే. అంతేకాదు, కొబ్బరి నీళ్లు రెగ్యులర్‌గా తీసుకునేవారిలో రక్తపోటు నియంత్రణలో వుంటుంది.

తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా వుంటుంది. అంతేకాదు, బరువు సమస్యలు కూడా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల తగ్గించుకోవచ్చని తాజా సర్వేలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com