దుర్గమ్మకు దసరా భక్తుల కానుకల వెల్లువ !
- October 22, 2024
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాల్లో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి నగదు బంగారం వెండితో పాటు విదేశీ డాలర్లను కనుక సమర్పించారు.
అధికారులు భక్తుల సమర్పించిన హుండీల లెక్కింపును ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులు నిర్వహించారు. ఇప్పటికే రెండు దఫాలుగా హుండీ లెక్కింపు నిర్వహించగా సోమవారం మూడో రోజు పలు హుండీలను లెక్కించారు.
కాగా, సోమవారం హుండీ లెక్కింపు సందర్భంగా… నగదు రూ. 3,05,96,971/- లు అమ్మవారికి భక్తులు నగదు రూపంలో కానుకలు చెల్లించుకున్నారు. కానుకల రూపములో బంగారం 321 గ్రాములు, వెండి 9 కేజీల 882 గ్రాములు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. విదేశీ కరెన్సీ లో యూఎస్ఏ-168 డాలర్లు, ఆస్ట్రెలియా 55 డాలర్లు, కువైట్-41.5 దినార్లు, ఖతార్-27 రియాల్స్, యూఏఈ-5 దిర్హాములు, మలేషియా-10 రింగేట్లు, సౌదీ-100 రియాల్స్ ను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.
మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు కలిపి నగదు రూ.9,26,97,047/- లు, కానుకల రూపములో బంగారం 733 గ్రాములు, వెండి 25 కేజీల 705 గ్రాములు అమ్మవారికి కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు విదేశీ డాలర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపు లో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో రత్న రాజు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







