అప్పుడలా ఒక్క సినిమాకే సెన్సేషన్ అయిపోయింది.! మరి ఇప్పుడెలా వుంటుందో.!
- October 22, 2024
శ్రీ నిధి శెట్టి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. వరల్డ్ సెన్సేషనల్ మూవీ ‘కేజీఎఫ్’లో నటించిన ఈ ముద్దుగుమ్మ అప్పట్లో సూపర్ సెన్సేషనల్.
అయితే, ఆ సెన్సేషన్ని శ్రీనిధి శెట్టి క్యాష్ చేసుకోలేకపోయిందెందుకో. కేవలం ‘కేజీఎఫ్’ రెండు సినిమాలతోనే ఈ ముద్దుగుమ్మకి ఆ తరహా క్రేజ్ దక్కింది.
ఆ తర్వాత ‘తమిళంలో విక్రమ్ సరసన ‘కోబ్రా’ సినిమాలో నటించింది కానీ, ఆ సినిమా ఆశించిన విజయం దక్కలేదు. కన్నడలో ‘కేజీఎఫ్’ తర్వాత మరో అవకాశం కూడా దక్కించుకోలేదు శ్రీనిధి శెట్టి.
దాంతో ‘కేజీఎఫ్’ బ్యూటీగానే సెటిలైపోయిందంతే. కానీ, ఇప్పుడు టాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. ‘తెలుసు కదా’ సినిమాతో డెబ్యూ చేస్తోంది తెలుగులో శ్రీనిధి శెట్టి.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే, నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న ‘హిట్ 3’లోనూ శ్రీ నిధి శెట్టి నటిస్తోంది.
ఈ రెండు సినిమాలూ ఆమెకు డైరెక్ట్ తెలుగు సినిమాలు. రీసెంట్గా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచీ శ్రీ నిధి శెట్టి పోస్టర్లు రిలీజ్ చేసి మేకర్లు ప్రత్యేకంగా విషెస్ అందించారు. చూడాలి మరి, తెలుగులోనైనా శ్రీ నిధి శెట్టి నిలదొక్కుకుంటుందో లేదో.!
తాజా వార్తలు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!







