ఆలివ్ ఆయిల్‌తో జుట్టు సంరక్షణ.!
- October 22, 2024
ఆలివ్ ఆయిల్‌లోని పోషకాలు జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయ్. జుట్టుకు ఆలివ్ ఆయిల్ కండిషనర్‌గా పని చేస్తుంది.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రును నివారించడానికి తోడ్పడతాయ్. అలాగే, జుట్టు చిట్లిపోవడం, పగిలిపోయి పొడిబారిపోయినట్లు కనిపించడం వంటి సమస్యలు ఆలివ్ ఆయిల్ ద్వారా తగ్గుతాయ్.
అంతేకాదు, ఆలివ్ ఆయిల్‌లోని ప్రీ రాడికల్స్ జుట్టు రాలడాన్ని నియంత్రించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయ్. జుట్టు మందాన్ని పెంచుతాయ్. డై హైడ్రో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల జుట్టు రాలిపోతుంటుంది.
ఈ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి, జుట్టును కాపాడడంలో ఆలివ్ ఆయిల్ కీలకంగా పని చేస్తుంది. అందుకే ఆలివ్ ఆయిల్‌ను డైలీ జుట్టుకు పట్టించి సున్నితంగా మర్దన చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తీరుతుంది.
జుట్టు రాలిపోవడం అనే సమస్య ఇప్పుడు ప్రతీ ఒక్కర్ని వేధిస్తోంది. ఈ సమస్యకు అనేక కారణాలు. పొల్యూషన్, తీసుకునే ఆహారం, చుండ్రు సమస్య.. ఇలా అనేక కారణాలు.
అన్నింటికీ ఆలివ్ ఆయిల్‌తో చెక్ పెట్టేయొచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







