29 స్టార్‌ హోటల్స్‌లో తనిఖీలు

- June 22, 2016 , by Maagulf
29 స్టార్‌ హోటల్స్‌లో తనిఖీలు



మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, 8 ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌లను నిర్వహించింది. దోహాలోని మొత్తం 29 హోటల్స్‌లో ఈ తనిఖీలు జరిగాయి. ఓల్డ్‌ సలాటా, వెస్ట్‌ బే, అల్‌ డఫ్నా, నజ్మా, ది పెరల్‌, లిగ్తయిఫియా, ది డిప్లామాటిక్‌ డిస్ట్రిక్ట్‌, రస్‌ అబు అబౌద్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లోని 4 మరియు 5 స్టార్‌ హోటల్స్‌లో ఈ తనిఖీల్ని నిర్వహించారు. జూన్‌ 14న ఈ క్యాంపెయిన్‌ ప్రారంభమయ్యింది. తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనగా, క్లీన్లీనెస్‌, స్టోరేజ్‌ మరియు మెయిన్‌టెనెన్స్‌ ఆఫ్‌ శానిటేషన్‌ అలాగే వేస్ట్‌ కంటెయినర్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, మనిసిపాలిటీ నుంచి సంబంధిత లైసెన్సుల్ని పొందకపోవడం, హెల్త్‌ సర్టిఫికెట్లు లేకుండా వర్కర్స్‌తో పనిచేయించడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. ఈ సందర్భంగా పలు హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com