అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాల సమయం..

- October 24, 2024 , by Maagulf
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాల సమయం..

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండు వారాల సమయమే ఉంది. నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా, న్యూ వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్‌ కాస్త ముందంజలో ఉన్నట్లు తేలింది. ట్రంప్‌ గెలుస్తారని 47 శాతం మంది, కమలా హారిస్‌ గెలుస్తారని 45 శాతం మంది చెప్పారు.

ఈ సర్వేను అక్టోబర్ 19-22 మధ్య 1,500 మంది ఓటర్ల నుంచి అభిప్రాయం తీసుకుని చేశారు. డెమొక్రటిక్ నామినీగా జో బైడెన్‌ను తొలగించి కమలా హారిస్‌ను ఆ పార్టీ నిలిపిన తర్వాత ఆ పార్టీకి సానుకూలతలు పెరిగాయని సర్వేలో తేలింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది కమలా హారిస్‌కు అనుకూలంగా, 54 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. సర్వేలో పాల్గొన్న వారు చాలా మంది వలసలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ట్రంప్‌ పరిష్కరిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తప్పుడు దిశగా వెళుతోందని 60 శాతం మంది అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com