హైదరాబాద్ నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- October 24, 2024
సికింద్రాబాద్: హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు నడపుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా అయిదు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ఇవాళ తన చాంబర్ లో తెలంగాణ ఎంపీలతో సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, డీకే అరుణ, రఘునందన్ రావు లు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90శాతం రైల్వేలైన్ల విద్యుద్దీకరణ జరిగిందని తెలిపారు. అమృత్ పథకం కింద పలు రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామన్నారు. వరంగల్లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్ ను పెంచామన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను రూ.720 కోట్లతో అధునికీకరణ చేస్తున్నట్లు వివరించారు కిషన్ రెడ్డి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి రూ.650 కోట్లు అవసరమని చెప్పారు. ఘట్కేసర్ వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ సర్వీసు ఉందని.. అక్కడి నుంచి యాదాద్రి వరకు విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా ఎంఎంటీఎస్ సర్వీసును పొడిగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
ఈదులపల్లి స్టేషన్ ను అభివృద్ది చేయండి..
ఈ సమవేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ఈదుల నాగులపల్లి స్టేషన్ ను అభివృద్ధి చేయాలని రైల్వే జీఎం ను కోరారు. కొల్లూరు, ఈదులు నాగులపల్లి రైల్వే బ్రిడ్జిని అభివృద్ధి చేయాలన్నారు. జర్నలిస్టులు, దివ్యాంగులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని కోరారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేయాలన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









