హైదరాబాద్: బాణాసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి...
- October 24, 2024
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా నగరంలో పటాకుల విక్రయాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కీలక ప్రకటన చేశారు. క్రాకర్స్ విక్రయించే దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు, హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలు నిర్ణయించినట్లు వెల్లడించారు.
దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్ http://www.ghmc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులు, న్యాయస్థానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు.కొన్ని టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని.. వాటిని అమ్మకూడదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారుల తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







