తెలంగాణ: మాజిద్, ఫిరోజ్ ఖాన్ లకు సీపీ ఆనంద్ వార్నింగ్
- October 25, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ , కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మధ్య జరిగిన గొడవ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారణ జరిపారు. హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ హోదాలో ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తో పాటు ఫిరోజ్ ఖాన్ వాదనలు విన్నారు. ఇరు పక్షాలు సీపీ ముందు తమ వాదనలు వినిపించాయి. అక్టోబర్ 1న హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిరోజ్ గాంధీ నగర్లో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పరిశీలిస్తుండగా.. అక్కడికి వెళ్లారు ఫిరోజ్ ఖాన్. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు గొడవ పడ్డారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారు. కేసు విచారణ సందర్భంగా రెండు వర్గాల మధ్య రాజకీయ వైరం ఉందని హుమాయూన్ నగర్ ఎస్హెచ్ఓ మెజిస్ట్రేట్ కు తెలిపారు.ఇరువర్గాల గొడవలతో స్థానికంగా ఉద్రికత్తలు నెలకొంటున్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీపీ సీవీ ఆనంద్.. రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తో పాటు ఫిరోజ్ ఖాన్ కు సూచించారు. పోలీస్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తదుపరి విచారణకు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







