పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూత
- October 25, 2024
తెలంగాణ: తెలంగాణ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన కనకరాజు కన్నుమూశాడు. ఆదిలాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనను 2021లో పద్మశ్రీతో సత్కరించింది. రేపు మార్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆసీఫాబాద్లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరుచూ ప్రదర్శిస్తూ.. భావితరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దీంతో ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీ కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. 2021 నవంబర్ 9న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







