ఆ నాలుగు దేశాలకు.. ఫ్లైదుబాయ్, ఎమిరేట్స్ విమానాలు రద్దు..!!

- October 26, 2024 , by Maagulf
ఆ నాలుగు దేశాలకు.. ఫ్లైదుబాయ్, ఎమిరేట్స్ విమానాలు రద్దు..!!

దుబాయ్: దుబాయ్ ఆధారిత క్యారియర్ ఫ్లైదుబాయ్.. శనివారం జోర్డాన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్‌లకు విమాన సర్వీసులను రద్దు చేసింది. కొన్ని విమానాలను దారి మళ్లించినట్టు ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రీబుకింగ్ లేదా రీఫండ్ ఆప్షన్‌ల కోసం దుబాయ్‌లోని ఫ్లైదుబాయ్ కాంటాక్ట్ సెంటర్‌ను (+971) 600 54 44 45, ఫ్లైదుబాయ్ ట్రావెల్ షాప్ లేదా వారి సంబంధిత ట్రావెల్ ఏజెంట్‌లను సంప్రదించాలని కస్టమర్‌లకు సూచించారు. మరోవైపు బాగ్దాద్, ఇరాన్ (టెహ్రాన్) లకు విమాన సర్వీసులను అక్టోబర్ 30 వరకు రద్దు చేసినట్టు ఎమిరేట్స్ ప్రకటించింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com