విశాఖ-విజయవాడ అందుబాటులో మరో రెండు విమాన సర్వీసులు
- October 26, 2024
విజయవాడ: విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి.వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం రాత్రి 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుతుంది. అక్కడ విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీస్ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ చేరుతుంది. . తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్ ల రాకతో విజయవాడ- విశాఖ విమాన సర్వీస్ల సంఖ్య మూడుకు చేరనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల