మానవ రహిత విమానం వచ్చేసింది!
- October 26, 2024
హైదరాబాద్: నిట్ట నిలువుగా టేకాఫ్‌తో పాటు, భూమి మీదకు దిగే సామర్థ్యం (VTOL) ఉన్న మానవ రహిత సరుకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్ సమీపంలోని నాదర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్‌లో శనివారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయిలో పూర్తి విమానాన్ని 2026 నాటికి సిద్ధం చేయనున్నట్లు బ్లూజే ఏరో సహ వ్యవస్థాపకులు అమర్‌దీప్ శ్రీ వత్సవాయ, ఉత్తమ్ కుమార్ వివరించారు. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని, సరుకుల రవాణాలో ఇది ఎంతో కీలకంగా మారుతుందని చెప్పారు.
హైదరాబాద్ నుంచి వరంగల్‌కు 30 నిమిషాల వ్యవధిలో చేరగలదని, గ్రామీణ ప్రాంతాలకూ సేవలు అందించేందుకు ఇది తోడ్పడుతుందని విశ్లేషించారు. 2026 నాటికి హైడ్రోజన్-విద్యుత్ ప్రొపెల్షన్‌తో అటానమస్ ఫ్లైట్ తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడే మనుషులను తీసుకెళ్లే వీటీఓఎల్ విమానాన్నీ ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విమానాశ్రయాలు లేని ప్రాంతాలకూ విమాన సేవలను అందించేందుకు వీలవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







