ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..యూఏఈ తీవ్ర ఆందోళన..!!
- October 27, 2024
యూఏఈ: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని యూఏఈ ఖండించింది. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) ఒక ప్రకటనలో కోరింది. ఘర్షణలు తీవ్రతరం కాకుండా దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని సైనిక కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్‌లలోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొందని ఇరాన్ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల