ఫిలడెల్ఫియాలో TANA సాంస్కృతిక పోటీలు
- October 28, 2024
అమెరికా: తానా మిడ్ అట్లాంటిక్ బృందం అక్టోబర్ 26న ఫిలడెల్ఫియాలో సాంస్కృతిక పోటీలను విజయవంతంగా నిర్వహించింది. గానం, నృత్యం విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 150 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్లాసికల్ మరియు నాన్ క్లాసికల్ విభాగాలలో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 600 మందికి పైగా హాజరై పోటీలలో పాల్గొన్నవారిని ప్రోత్సహించారు. మధ్యాహ్నం 12:30PMకి ప్రారంభమైన పోటీలు విరామం లేకుండా రాత్రి 10:00PM వరకు కొనసాగాయి.
ప్రముఖ నటుడు మరియు డాన్సర్ ఇంద్రనీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శివతాండవం మరియు NBK50 మెలోడీతో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. గాయని శ్రావణి చిట్టా అతిథిగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఇంద్రనీల్ మరియు శ్రావణి చిట్టాలను సత్కరించి వాలంటీర్లు, దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటిల సహకారంతో సురేష్ యలమంచి, కృష్ణ నందమూరి సాంస్కృతిక పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఫణి కంతేటి, విశ్వనాథ్ కోగంటి, సరోజా పావులూరి, రాజేశ్వరి కంతేటి, రంజిత్ మామిడి, చందు బసుత్కర్, చలం పావులూరి, వెంకట్ గూడూరు, భవినీ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సునీత వాగ్వల, నాయుడమ్మ యలవర్తి, రవీనా తుమ్మల, నీలిమ వోలేటి, గోపి వాగ్వాల, భవాని క్రొత్తపల్లి, మనీషా మేక, గీత పొన్నగంటి, వ్యోమ్ క్రొత్తపల్లి, కృషిత నందమూరి, ధీరజ్ యలమంచి, మాన్విత యాగంటి తదితరులు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశారు.




తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







