కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం..

- October 29, 2024 , by Maagulf
కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం..

కేరళ సీఎం పినరయి విజయన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ మహిళ కారణంగా సీఎం కాన్వాయ్ లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. అయితే, ఎలాంటి ప్రమాదం జరగడకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ స్కూటీపై కాన్వాయ్ కు అడ్డుగా రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

సీఎం విజయన్ కొట్టాయం సందర్శనకు వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం రాజధానికి వెళ్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో వామనపురం వద్ద సీఎం కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. వామనపురంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ సీఎం కాన్వాయ్ వచ్చే సమయంలోనే ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన కాన్వాయ్ లోని ముందు వెళ్తున్న పైలట్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక ఉన్న సీఎం కారు, అంబులెన్స్ సహా ఎస్కార్ట్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటీన బయటకుదిగి సీఎం ప్రయాణిస్తున్న కారు వద్దకు చేరుకున్నారు.

ఈ ప్రమాదంలో అదృష్టవ శాత్తూ సీఎం, ఇతర సిబ్బందికి ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే కాన్వాయ్ ముందుకు కదిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళ స్కూటీ నడిపిన తీరుపట్ల మండిపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com