'బుల్లెట్ బండి' టైటిల్, పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
- October 29, 2024
ట్యాలెంట్ పవర్ హౌస్ రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్ లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'బుల్లెట్ బండి'అనే క్యాచి టైటిల్ పెట్టారు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలీష్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ సింగ్ డివోపీ కాగ, వడివేల్ విమల్ రాజ్ ఎడిటర్, రాజు ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: రాఘవ లారెన్స్, ఎల్విన్, సునీల్ తదితరులు
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: ఇన్నాసి పాండియన్
నిర్మాత: కతిరేసన్
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్
మ్యూజిక్: సామ్ సిఎస్
డీవోపీ: అరవింద్ సింగ్
ఎడిటర్: విమల్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్: రాజు
పీఆర్వో: వంశీ- శేఖర్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







