'మట్కా' నుంచి నారాయణ మూర్తి గా పి రవిశంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్
- October 29, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు, నారాయణ మూర్తి గా పి రవిశంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కథలో రవిశంకర్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతోంది. ఇందులో ఆయన రూత్ లెస్ జైలర్ గా కనిపించబోతున్నారు. ఇంటెన్స్ లుక్ లో రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని కనిపించిన రవిశంకర్ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







