'జీబ్రా' నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్
- October 29, 2024
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా.ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈరోజు, సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్తో మేకర్స్ వచ్చారు.
జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ పోస్టర్లో సత్య దేవ్, డాలీ ధనంజయ ఫెరోసియస్ గా కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో కరెన్సీ నోట్లు, లైట్ హౌస్, ఫ్యాక్టరీ మొదలైన ఎలిమెంట్స్ ని మనం చూడవచ్చు.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌తో మేకర్స్ క్యూరియాసిటీని పెంచుతూ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీజర్ మంచి రెస్పాన్స్ తో భారీ అంచనాలను నెలకొల్పింది.
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిషినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.
రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
నటీనటులు: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో, సత్య అక్కల, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
ఎడిషినల్ స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్లు: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి
డీవోపీ: సత్య పొన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







