నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ..
- November 03, 2024
హైదరాబాద్: పర్యాటకులకు అదిరిపోయే శుభవార్త అందింది. సోమశీల నంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ టూర్ ప్రారంభమయ్యింది. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 2 నుంచి లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. సుమారు 100 మంది టూరిస్టులతో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభమయ్యింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని కార్తిక మాసం తొలిరోజున తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ.. సాగర్లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో.. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీటి లభ్యత ఉంది. దీంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.
నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఇవాళ ప్రారంభించారు. అక్కణ్నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటలపాటు ఈ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్ ధరలు నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ తెలిపింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లొచ్చు. ఈ రెండు జర్నీల్లో నదికి రెండువైపులా కొండలు, దట్టమైన అడవులు, జింకలు, దుప్పులు, చారిత్రక కోటలు, చిన్న చిన్న జలపాతాలను చూడొచ్చు. పాపికొండలు తరహాలోనే ఇదీ ఉంటుంది అంటున్నారు. ఇందులో పెద్దవారికి టికెట్ ధర రూ.2,000 ఉంది. పిల్లలకు రూ.1,600 ఉంది. రౌండప్ జర్నీ (వెళ్లి, తిరిగి రావడం)కి పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400 తీసుకుంటున్నారు. పూర్తి వివరాల్ని https://tourism.telangana.gov.in లో తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







