పిస్తా పప్పును వీళ్లు అస్సలు తినకూడదు
- November 05, 2024
డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతున్నారు. దీంతో.. బాదం, జీడి, పిస్తా, ఎండు ద్రాక్ష, అంజీర్, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌కి డిమాండ్ పెరిగింది. వీటిని చాలా మంది స్నాక్స్‌గా తీసుకుంటున్నారు. కొందరైతే.. నానబెట్టి ఉదయాన్నే తింటున్నారు. అయితే, ఈ డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా పప్పుకి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది నోటికి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా పిస్తా పప్పుని ఎంతో ఇష్టంగా తింటారు.రోజుకి ఐదు నుంచి ఆరు పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంట. ఇంకా రుచి సంగతి పక్కన పెడితే పిస్తా పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ పిస్తా పప్పు కొందరికి పడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఇంతకీ పిస్తా పప్పు ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.పిస్తా పప్పులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మెగ్నిషియం, కాపర్, జింక్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ6, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి ఎన్నో ఖనిజాలు, మినరల్స్ లభిస్తాయి.
వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా మెదడు పని తీరు మెరగవుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మోనోశాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెట్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పిస్తా పప్పులో ఉంటాయి. దీంతో.. పిస్తా పప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కంటి ఆరోగ్యం మెరగవుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, కొందరు పిస్తా పప్పు తినకూడదు.
పిస్తా పప్పును చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే, పెద్దలు దగ్గర ఉండి పిల్లలకు పిస్తా పప్పు తినిపిస్తే మంచిది. ఎందుకంటే వాళ్లకు తెలియకుండా ఒక్కోసారి ఐదారు పిస్తా పప్పులు నోట్లో వేసుకుంటారు. దీంతో పిస్తా పప్పులు గొంతుకు అడ్డు పడే ప్రమాదముంది. అందుకే పిల్లలకు పిస్తా పప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. దీంతో.. ఇవి ఎక్కువగా తింటే కిడ్నిలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు వీటిని తినకపోవడమే ఉత్తమని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడం కోసం కొందరు డ్రై ఫ్రూట్స్‌తో డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలి. ఎందుకంటే పిస్తా పప్పులో ఎక్కువ కేలరీలు ఉంటాయి. దీంతో.. పిస్తా పప్పు తినడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
అలర్జీ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలి. పిస్తా పప్పు ఎక్కువ తినడం వల్ల శరీరంలో వేడి బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో.. వేడి వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పు తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలపిస్తే వైద్యుణ్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!