ఐపీఎల్ 2025లో అత్యంత కాస్ల్టీ ప్లేయర్ ఇతనే .. వేలానికి ముందే బంపరాఫర్..!
- November 06, 2024ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఆక్షన్ నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది.
సోమవారంతో వేలానికి క్రికెటర్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగిసింది. ఈసారి మెగా ఆక్షన్‌లో కొందరు క్రికెటర్లు భారీ ధర పలికే అవకాశం ఉంది. అయితే రిటెన్షన్స్‌లో కూడా కొందరు ప్లేయర్లకు ఫ్రాంఛైజీలు కళ్లు చెదిరే అమౌంట్ ఆఫర్ చేశాయి. వేలం ముందు వరకు చూస్తే.. ఐపీఎల్ 2025లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ క్రికెటర్‌గా సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు.
ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఐపీఎల్ టీమ్స్ ఆరుగురు క్రికెటర్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. చాలా జట్లు కోర్ లైనప్‌ను కంటిన్యూ చేశాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్స్ తమ ప్లేయర్ రిటెన్షన్ లిస్టును అక్టోబర్ 31న విడుదల చేశాయి. ఫ్రాంచైజీలు కీ ప్లేయర్స్‌కు మంచి ధర ఆఫర్ చేసి రిటెన్షన్ చేసుకున్నాయి. అయితే ఐపీఎల్ 2024లో సత్తా చాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రిటెన్షన్ చేసుకున్న టీమ్ మెంబర్స్‌కు మంచి అమౌంట్ ఇచ్చింది. ముఖ్యంగా సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్, గత ఎడిషన్‌లో టీమ్‌కు బ్యాక్‌బోన్‌గా నిలిచిన హెన్రిచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్లకు రిటెన్షన్ చేసుకుంది.
ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడు
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు వరకు చూస్తే.. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్ అత్యంత ఖరీదైన ఆటగాడు. అతడు ఐపీఎల్ 2024లో మొత్తం 16 మ్యాచ్‌ల్లో 39.92 యావరేజ్, 171.07 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేశాడు. 2024 సీజన్‌లో SRH ఫైనల్స్‌కు వెళ్లిందంటే, అందుకు కారణం క్లాసెన్. అందుకే అతన్ని ఎక్కువ మొత్తానికి టీమ్ రిటెన్షన్ చేసుకుంది. 33 ఏళ్ల ఈ సౌతాఫ్రికా క్రికెటర్, ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడుతూ సత్తా ఆటుతున్నాడు. గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్‌గా అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు.
తర్వాతి ప్లేస్‌లో ఆ ఇద్దరు
ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, నికోలస్ వూరన్ ఇద్దరూ రెండో ప్లేస్‌లో ఉన్నారు. కోహ్లీని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ.21కోట్లకు రిటెన్షన్ చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్, విండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లతో కంటిన్యూ చేసింది. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ 2024లో టీ20 క్రికెట్‌లో 2,400కి పైగా పరుగులు సాధించాడు. IPL కెరీర్‌లో 76 మ్యాచ్‌లు ఆడిన పూరన్, 32.16 యావరేజ్, 162.29 స్ట్రైక్ రేట్‌తో 1,769 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 127 సిక్సర్లు, 113 ఫోర్లు ఉన్నాయి.
ఐపీఎల్ 2025 రిటెన్షన్స్‌లో టాప్ ప్లేయర్స్ లిస్ట్
రూ. 23 కోట్లు: హెన్రిచ్ క్లాసెన్
రూ.21 కోట్లు: విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్
రూ.18 కోట్లు: రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్
రూ. 16.5 కోట్లు: అక్షర్ పటేల్, శుభమన్ గిల్
తాజా వార్తలు
- పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్
- తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు
- Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!
- KD500లకు రెసిడెన్సీ విక్రయం..ఇద్దరు అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో 121% పెరిగిన టూర్ గైడ్ లైసెన్స్‌లు..!!
- అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!
- యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!
- డిస్నీల్యాండ్‌ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం