భార్యతో కలిసిపోయిన ధనుష్.. మామ ఆఖరి కోరిక తీరుస్తాడా?
- November 06, 2024
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన ఎంత స్టార్ అయినా కూడా.. తన బిడ్డలను మాత్రం స్టార్స్ ను చేయలేకపోయాడు.
రజినీకి ఇద్దరు కూతుళ్లు. సౌందర్య రజినీకాంత్, ఐశ్వర్య రజినీకాంత్. హీరోయిన్స్ గా కాకుండా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిర్మాతలుగా మారారు. కానీ, అందులో ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు. తండ్రిగా రజినీ.. వారికి తోడుగా ఉన్నా కూడా విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
ఇక రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. అయితే ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇక వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ. తాము మాత్రం కలిసేది లేదని నిర్మొహమాటంగా తెలిపారు.
ఇక ఈ ఏడాదిలోనే వీరి విడాకుల కేసు కోర్టుకు వచ్చింది. కానీ, ఆ కేసుకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో మళ్లీ వీరు కలిసిపోనున్నారని వార్తలు వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ధనుష్- ఐశ్వర్య కలిసే ఉంటున్నారట. అంతేకాదు ఈ దీవాళీని కూడా ఈ జంట కలిసే సెలబ్రేట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరు కలవడానికి రజినీనే కారణమని అంటున్నారు.
ఈ మధ్యనే రజినీ అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. గుండెల్లో ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి వచ్చాకా.. ఆయన.. కూతురు అల్లుడు తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కూతురు – అల్లుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, అదే తన ఆఖరి కోరిక అని చెప్పడంతో ధనుష్- ఐశ్వర్య కొద్దిగా అలోచించి విడాకులను రద్దు చేసుకోనున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ధనుష్- ఐశ్వర్య మళ్లీ జంటగా మీడియా ముందుకు రానున్నారు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







