అమెరికా ఎన్నికల్లో గెలిచిన భారతీయులు
- November 06, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారతీయ సంతతికి చెందిన వారు కూడా విజయం సాధిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు.
డెమొక్రాట్ల తరుపున అభ్యర్థిగా పోటీ చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాదించారు. దీంతో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయంసాధించారు. సుహాస్ సుబ్రహ్మణ్యం గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు టెక్ పాలసీ అడ్వయిజర్ గా పనిచేశారు.
డెమొక్రటిక్ అభ్యర్థులుగా...2020 నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వర్జీనియా సెనేట్ కు ఎన్నికయ్యారు. సుహాస్ సుబ్రహ్మణ్యంతో పాటు మరో భారతీయ సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి కూడా విజయం సాధించారు. ఇల్లినోయా 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి రాజా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఆయన కూడా డెమొక్రట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. భారతీయ సంతతికి చెందిన మనోళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం... అదీ డెమొక్రాట్ల తరుపున సాధించడం విశేషం.
I am honored and humbled that the people of Virginia’s 10th District put their trust in me to take on the toughest fights and deliver results in Congress. This district is my home. I got married here, my wife Miranda and I are raising our daughters here, and the issues our… pic.twitter.com/rV1Kez0Evn
— Suhas Subramanyam (@SuhasforVA) November 6, 2024
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







