బహ్రెయిన్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం..రిఫ్ఫాలో నిర్మాణాల కూల్చివేత..!!
- November 07, 2024
బహ్రెయిన్: సదరన్ మున్సిపాలిటీ అక్రమ రోడ్ల ఆక్రమణల తొలగింపు క్యాంపెయిన్ ను విజయవంతంగా కొనసాగిస్తుంది. ఉపయోగించిన దుస్తులను సేకరించేందుకు ఉపయోగించే 500 పైగా లైసెన్స్ లేని కంటైనర్లను రీజియన్‌లోని వివిధ ప్రాంతాలు, నివాస సముదాయాల నుండి తొలగించారు.సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పురపాలక సంఘం సమన్వయంతో రెండు నెలలకు పైగా కొనసాగిన తనిఖీ ప్రచారం జరిగిందని దక్షిణ మున్సిపాలిటీ వెల్లడించింది. అనుమతి లేకుండా పబ్లిక్ రోడ్లపై వస్తువులు, ప్రదర్శనలు, కియోస్క్‌లు లేదా ఇతర నిర్మాణాలను ఉంచడంపై నిషేధం ఉందని అధికారులు గుర్తుచేశారు.ఈ ప్రచారం మునిసిపాలిటీ విస్తృత పని ప్రణాళికలో భాగమన్నారు.ఇది ఉల్లంఘనలను తగ్గించడానికి, నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్నిప్రజలకు అవగాహన కల్పించడానికి నియంత్రణ, తనిఖీ చర్యలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







