అగ్నిప్రమాదానికి గురైన హోటల్ మూసివేత..మరో హోటల్ కు గెస్టుల తరలింపు..!!
- November 07, 2024
దుబాయ్: దుబాయ్ లో గత శుక్రవారం అర్థరాత్రి హయత్ ప్లేస్, బనియాస్ స్క్వేర్ డీరా హోటల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా అధికారులు తాత్కాలికంగా దానిని మూసివేశారు. అందులో ఉన్న గెస్టులను అదే మేనేజ్ మెంట్ నిర్వహణలో పనిచేసే సమీపంలోని మరో హోటల్‌లకు తరలించారు. ప్రమాదం సమయంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ సిబ్బంది సకాలంలో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అతిథులతోపాటు వారి వస్తువులను తరలించినట్టు హోటల్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఘటన తర్వాత హోటల్‌కు తిరిగి రాని అతిథులు వచ్చి తమ వస్తువులను తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్న అతిథులు సమీపంలో ఉన్న మరో హోటల్లో బస కల్పిస్తామన్నారు. హోటల్ మూసివేతతో పాటు భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెస్టారెంట్లు, దుకాణాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల