‘లెవెన్’ నుంచి లవ్లీ మెలోడీ తగువాడు దొరికెనే సాంగ్ రిలీజ్
- November 07, 2024
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఎఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రుతిహాసన్ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి తగువాడు దొరికెనే సాంగ్ రిలీజ్ చేశారు.డి.ఇమ్మాన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన లిరిక్స్ క్యాచిగా వున్నాయి. శ్వేతా మోహన్ లవ్లీ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.
సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం – లోకేశ్ అజ్ల్స్
బ్యానర్ – AR ఎంటర్టైన్మెంట్
నిర్మాత – అజ్మల్ ఖాన్ & రేయా హరి
సంగీతం – డి.ఇమ్మాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ప్రభు సాలమన్
సహ నిర్మాత – గోపాలకృష్ణ.ఎం
డీవోపీ – కార్తీక్ అశోక్
ఎడిటర్ – శ్రీకాంత్.ఎన్.బి
ఆర్ట్ డైరెక్టర్ – పి.ఎల్. సుబెంథర్
యాక్షన్ డైరెక్టర్ – ఫీనిక్స్ ప్రభు
పీఆర్వో- వంశీ శేఖర్
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







