ఏపీలో అత్యంత దారుణమైన పరిస్థితులు: వైఎస్ జగన్

- November 07, 2024 , by Maagulf
ఏపీలో అత్యంత దారుణమైన పరిస్థితులు: వైఎస్ జగన్

అమరావతి: ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు..బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ప్రశ్నించే స్వరం ఉండకూడదని.. అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com