#SDT18 ఇంటెన్స్ రోల్ లో శ్రీకాంత్
- November 08, 2024మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మేకర్స్ లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో పవర్ హౌస్ పెర్ఫార్మర్ శ్రీకాంత్ క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు. ఇంటెన్స్ లుక్ లో ప్రెజంట్ చేసిన శ్రీకాంత్ ఇంట్రో పోస్టర్ క్యురియాసిటీ పెంచింది.
ఇటివలే రిలీజ్ చేసిన “ఇంట్రూడ్ ఇన్టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేసింది.
#SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించనున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్
మ్యూజిక్: బి. అజనీష్ లోక్‌నాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







