'సంక్రాంతికి వస్తున్నాం' ఫైనల్ షెడ్యూల్ అరకులో ప్రారంభం
- November 08, 2024
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అద్భుతమైన హ్యాట్రిక్ కొలాబరేషన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే రెండు పెద్ద హిట్లను అందించింది. బ్లాక్బస్టర్లను అందించడంలో అనిల్ రావిపూడి ది స్పెషల్ రికార్డ్.అప్ కమింగ్ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇవ్వడంతో పాటు, యూనిక్ ట్రైయాంగిలర్ క్రైమ్ నెరేటివ్ ని అందిస్తుంది.రీసెంట్ గా రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు ఫైనల్ షెడ్యూల్ అరకులో ప్రారంభమైయింది. మేకర్స్ రిలీజ్ చేసి వీడియోలో స్కూల్ స్టూడెంట్స్ హీరో వెంకటేష్ గారికి సాదరంగా స్వాగతం పలకడం, ఆయన ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్.ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం' 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా,చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
మార్కెటింగ్: నాని
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







