చేనేత కార్మికులకు ప్రభుత్వం నిరంతర ప్రోత్సాహం: మంత్రి సవిత
- November 08, 2024
పుట్టపర్తి: చేనేతకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని, చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమo, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శుక్రవారం పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని చక్రవర్తి రోడ్డు వైపు లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆప్కో షో రూమ్ ను పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి తో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన జిల్లాఏర్పడిన తర్వాత ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన పుట్టపర్తిలో మొట్టమొదటిసారిగా తొలి ఆప్కో షో రూమ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.రాష్ట్ర చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళేందుకు ఆప్కో నూతన షోరూoను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి తెలిపారు.సమాజంలోని ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలనిమంత్రి పిలుపు నిచ్చారు.చేనేత రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో చేనేత కార్మికులు ఎన్నో ఒడుగుదడుగులకు గురయ్యారని ప్రస్తుతం తమ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలకు మంచి మార్కెటింగ్ సదుపాయం కొరకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గత 5 నెలలుగా ఆప్కోఅనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఆప్కో షోరూమ్ మేనేజర్లకు విక్రయ అభివృద్ధిలో మెలకువలు నేర్పించుట గాను స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు.ఆప్కో సంస్థ ఈ సంవత్సరంలో అక్టోబర్ వరకు సుమారు రూ. 18 .36 కోర్టులో సాధారణ విక్రయాలను సాధించిందని గత సంవత్సరం కంటే రూ. 2 కోట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. అలాగే వివిధ సంక్షేమ శాఖలకు ఆప్కోద్వారా సరఫరా చేసిన వస్త్రాలు రూ.28.86 కోట్లు కాగా,గత సంవత్సరంతో పోలిస్తే ఇది కూడా రూ .12కోట్లు ఎక్కువగా ఉందని ఆప్కో అభివృద్ధికి ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలందరూ ముఖ్యంగా ఉద్యోగులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను విధిగా ధరించాలని మంత్రి కోరారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ట్రేడింగ్ లో ఉన్న ఈ కామర్స్ ద్వారా చేనేత ఉత్పత్తుల వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా వినియోగదారుల అభివృద్ధిలో అవసరాలను గుర్తించి యువత కూడా చేనేత ఉత్పత్తులను ఉపయోగించు కోవాలనే ఉద్దేశంతో ఆప్కో ఈ మధ్యకాలంలో అనేక ఆధునిక ఉత్పత్తులను యువత అభిరుచుల మేరకు తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ధర్మవరం పట్టుచీరలు, పొందూరు ఖద్దరు, కలంకారీ చీరలు తదితర వస్త్రాలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రసిద్ధిగాంచినట్లు తెలిపారు. ఆప్కో షోరూమ్ల ద్వారా ఆన్లైన్ అమ్మకాలు కూడా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రసిద్ధి చెందినది చేనేత రంగమని చేనేత గొప్ప సంపదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చేనేతను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వం చేనేత రంగానే నిర్వీర్యం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చేనేత వృత్తి దేశంలోనే వైవిధ్యాన్ని హస్తకళల నైపుణ్యాన్ని చాటుతుందని విదేశాల్లో కూడా మన జిల్లా నుండి రాష్ట్రం వరకు చేనేత వృత్తికారులు అనేక విధాలుగా సరికొత్త డిజైన్లతో వస్త్రాలను తయారు చేసి మన రాష్ట్రం కీర్తిని దశ దిశలా చాటుతున్నట్లు సింధూర రెడ్డి తెలిపారు.చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేతకు చేత నివ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. పావనమూర్తి , జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు, ఏడి రామకృష్ణ, డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ మధుబాబు, ఆర్డీవో సువర్ణ, డీఎస్పీ విజయ్ కుమార్, సేల్స్ మేనేజర్ వాణి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!