బహ్రెయిన్‌లో ‘హిల్టన్’ హోటల్స్ కెరీర్ ఫెయిర్..!!
- November 09, 2024
మనామా: హిల్టన్ బహ్రెయిన్, హిల్టన్ గార్డెన్ ఇన్ బహ్రెయిన్ బే, కాన్రాడ్ బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్, త్వరలో తెరవబోయే హిల్టన్ బహ్రెయిన్ సిటీ సెంటర్ హోటల్ & రెసిడెన్సెస్తో సహా బహ్రెయిన్‌లోని హిల్టన్ ప్రాపర్టీలు వాటెల్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ స్కూల్ సహకారంతో "హిల్టన్ హాస్పిటాలిటీ అన్లాక్డ్" పేరుతో కెరీర్ ఫెయిర్‌ను నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటాలిటీ పరిశ్రమలో కెరీర్ మార్గాలను తెలుసుకునే వారి కోసం ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించింది. విభిన్న కార్యకలాపాలతో కూడిన ఏడు ఇంటరాక్టివ్ బూత్‌లు ఉండగా, ఒక్కొక్కటి హిల్టన్ ప్రాపర్టీలలోని వివిధ విభాగాల గురించి తెలియజేశాయి. ఫ్రంట్ ఆఫీస్ కార్యకలాపాలు, ఫుడ్, బివరేజేస్ సర్వీస్, ఈవెంట్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్‌తో సహా హాస్పిటాలిటీ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. "హిల్టన్ హాస్పిటాలిటీ అన్లాక్డ్' కెరీర్ ఫెయిర్ హాస్పిటాలిటీ రంగంలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడంలో వాటెల్ భాగస్వామ్య నిబద్ధతకు నిదర్శనం అని వాటెల్ జనరల్ డైరెక్టర్ షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా అన్నారు. హిల్టన్‌తో కలిసి పనిచేయడం వల్ల విద్యార్థులకు పరిశ్రమల ప్రముఖులతో పరస్పరం ఇంటరాక్ట్ అయి విభిన్న కెరీర్ మార్గాలను తెలుసుకోవడంతోపాటు డైనమిక్ వర్క్‌ఫోర్స్‌లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలను తెలుసుకుంటారని తెలిపారు.తమ హోటళ్లలో అందుబాటులో ఉన్న డైనమిక్,రివార్డింగ్ కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశమని హిల్టన్ బహ్రెయిన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ మలక్ రాద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







