మెడికల్ సిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న ఒమాన్ సుల్తాన్

- November 10, 2024 , by Maagulf
మెడికల్ సిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న ఒమాన్ సుల్తాన్

మస్కట్: మస్కట్‌లో మిలిటరీ మరియు భద్రతా సేవల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన మెడికల్ సిటీ ఆసుపత్రిని ఒమాన్ హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ నవంబర్ 11 న ప్రారంభించనున్నారు. ఈ హాస్పిటల్ చారిత్రక ఒమానీ ఆర్కిటెక్చర్ యొక్క మాస్టర్ పీస్ తో రూపొందించిన లేటెస్ట్ అంతర్జాతీయ స్పెసిఫికేషన్‌లతో వివిధ ప్రత్యేకతలు వైద్య పరికరాలు మరియు అత్యాధునిక సాంకేతికతలతో నిర్మించారు.

2022లో రాయల్ డిక్రీ ద్వారా స్థాపించబడిన ఈ మెడికల్ సిటీ, సైనిక మరియు భద్రతా సేవల సభ్యులకు సమగ్ర వైద్య సేవలు మరియు ఆరోగ్య సంరక్షణను అందించడం కోసం నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు సౌకర్యాలతో నిర్మించబడిన ఈ హాస్పిటల్ సైనికులకు మరియు భద్రతా సేవల సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సందర్భంగా ఆసుపత్రి నీ సందర్శించిన సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆసుపత్రి యొక్క వివిధ విభాగాలను పరిశీలించి, అందులో అందించే వైద్య సేవలను సమీక్షించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా సైనిక మరియు భద్రతా సేవల సభ్యులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం మెరుగైన సదుపాయాలను పొందగలుగుతారు. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు సమగ్ర వైద్య సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన అడుగు.

ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్యులు, మరియు విస్తృత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. 

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com