రోజుకు 2 ఖర్జూరాలు తింటే ఈ సమస్యలన్నీ దూరం

- November 10, 2024 , by Maagulf
రోజుకు 2 ఖర్జూరాలు తింటే ఈ సమస్యలన్నీ దూరం

ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారడం దగ్గర్నుంచి బరువు తగ్గేవరకూ చాలా హెల్ప్ చేస్తుంది. అయితే, వీటిని బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలుంటాయని చెబుతున్నారు నిపుణులు.

ఖర్జూరాల్లో విటమిన్స్ ఎ, కె‌లు ఉంటాయి. ఇవి మీ బాడీకి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల కణాలు డ్యామేజ్ అవ్వవు. అదే విధంగా, కొంతమందికి స్వీట్స్ తినాలనే కోరికలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇందులోని సహజ తీపి గుణాలు ఆ క్రేవింగ్స్‌ని తగ్గిస్తాయి. దీంతో మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్లుగా అనిపిస్తుంది.

ఒక్కోసారి ఏ పనిచేయకుండానే అలసటగా ఉంటుంది. నీరసంగా ఉండి ఏ పని చేయలేకపోతాం. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మన పనులు కూడా మనం చేయలేం. నడవడం, మెట్లు ఎక్కడం, ఇతర పనులు చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగే బదులు ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో 2, 3 ఖర్జూరాలు తినండి. దీంతో అప్పటికప్పుడు మంత్రం వేసినట్టుగా ఎనర్జీ వస్తుంది.

ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల్ని బలంగా చేస్తాయి. దీంతో ఆస్టీయోపోరోసిస్ వంటి సమస్యలు రావు. ఎదిగే పిల్లలకి, వృద్ధులకి వీటిని ఇవ్వడం మంచిది. అదే విధంగా బ్రెయిన్‌ని మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగి షార్ప్‌గా పనిచేస్తారు.

ఖర్జూరాల్లో బయోయాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్ బీటా డీ గ్లూకాన్ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. వీటితో పాటు బీపి, కొలెస్ట్రాల్‌ కంట్రోల్ అవుతాయి. అయితే, ఇవి ఎంత ఆరోగ్యమైనప్పటికీ తియ్యగానే ఉంటాయి. కాబట్టి, షుగర్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిది.

ముందుగా చెప్పుకున్నట్లుగా  ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లుంటుంది. ఎక్కువగా తినరు. దీంతో బరువు కూడా పెరగరు. మెటబాలిజం పెరిగి కేలరీలు కరిగేలా చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో సరైన లైఫ్‌స్టైల్ లేని కారణంగా చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడతారు. మలబద్ధకం, కడుపు నొప్పి, ఇతర సమస్యలతో సతమవతమవుతారు. వీటికి చెక్ పెట్టేందుకు ఖర్జూరాలు హెల్ప్ చేస్తాయి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో 2 డేట్స్ తినండి. దీంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం సమస్య దరికి రానే రాదు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com