యూపీఐ 123పే.. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లేకుండానే పేమెంట్స్ చేయొచ్చు!
- November 10, 2024
యూపీఐ 123పే లిమిట్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల యూపీఐ 123పే కోసం లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ.10వేలకి పెంచింది.అయితే, యూపీఐ 123పే అంటే ఏంటో తెలుసా? యూపీఐ 123పే అనేది స్మార్ట్‌ఫోన్ యేతర, ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూపొందించింది. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండానే యూపీఐ సేవలను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది.
యూపీఐ 123పే కింద లావాదేవీలు ఉచితంగా పూర్తి చేయొచ్చు. యూపీఐ పిన్ అనేది మొబైల్ యాప్. ఐవీఆర్ లేదా మరొక ఛానెల్ ద్వారా మీ ప్రారంభ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు క్రియేట్ చేసే 4-6 అంకెల పాస్‌కోడ్. అన్ని బ్యాంక్ లావాదేవీలను అథెంటికేట్ చేసేందుకు ఈ యూపీఐ పిన్ అవసరం. అక్టోబర్ 9, 2024న అభివృద్ధి, నియంత్రణ విధానాలపై ఆర్బీఐ ప్రకటన చేసింది. భారత్‌లోని ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం డిజిటల్ పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ మార్పును అక్టోబర్ 25, 2024 నాటి సర్క్యులర్‌లో ధృవీకరించింది. గడువు తేదీ జనవరి 1, 2025కి సెట్ అయింది. యూపీఐ 123పే ద్వారా కస్టమర్‌లు తమకు అందించిన జాబితా నుంచి లాంగ్వేజీని ఎంచుకోవచ్చు. లాంగ్వేజీల జాబితాలో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మలయాళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.
యూపీఐ 123 పేమెంట్: పేమెంట్ మెథడ్స్ ఇవే:
యూపీఐ 123పే స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ యూజర్లకు 4 సపోర్టు చేసే మెథడ్స్ ద్వారా వివిధ డిజిటల్ లావాదేవీలను నిర్వహించవచ్చు.ఐవీఆర్ నంబర్ ద్వారా వాయిస్ పేమెంట్, సౌండ్ ఆధారిత పేమెంట్లు, మిస్డ్ కాల్ ఆధారిత పేమెంట్ ఆప్షన్లు, యాప్ ఆధారిత స్కాన్-అండ్-పే ఫీచర్ ఫీచర్ ఫోన్‌లలో యాక్సస్ చేయొచ్చు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







