ఫలించిన పోరాటం..ఆలీలో కొత్త సెంట్రల్ మార్కెట్ కు ఆమోదం..!!
- November 11, 2024
మానామా: ఆలీలోని స్థానికుల పోరాటం ఫలించింది. కొత్త మార్కెట్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించేందుకు నార్తర్న్ మునిసిపల్ కౌన్సిల్ నిరంతర ప్రయత్నాల తర్వాత, ఆలీ కొత్త మార్కెట్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు మునిసిపాలిటీ వ్యవహారాల అండర్ సెక్రటరీ, షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. మంత్రిత్వ శాఖకు కేటాయించిన స్థలంలో మార్కెట్ నిర్మాణం కోసం పరిశీలిస్తోందని ధృవీకరించారు. అయితే, ఈ ప్లాన్ కు ఇంకా ఆర్థిక, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు రావాల్సి ఉందని మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా అషూర్ స్పష్టం చేశారు. అనుమతులన్ని త్వరలోనే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపాదిత సెంట్రల్ మార్కెట్.. స్థానిక వస్తువులను ప్రోత్సహించడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగాలను అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







