ఒమన్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీతో అల్ మౌజ్ మస్కట్ ఒప్పందం..!!

- November 11, 2024 , by Maagulf
ఒమన్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీతో అల్ మౌజ్ మస్కట్ ఒప్పందం..!!

మస్కట్: కమర్షియల్ రెసిడెన్షియల్ వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ లో భాగంగా ఇంటర్నెట్ కేబులింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఒమన్ బ్రాడ్‌బ్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అల్ మౌజ్ మస్కట్ ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థానిక ఇంటర్నెట్ ఆపరేటర్‌ల మధ్య పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని, నివాసితులు వివిధ రకాలైన అధిక-నాణ్యత ఇంటర్నెట్ సేవా ఎంపికలను కలిగి ఉండేలా చూస్తుందని అధికారులు తెలిపారు.  

అల్ మౌజ్ మస్కట్ సీఈఓ నాసర్ అల్ షీబానీ మాట్లాడుతూ.. ఒమన్ బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ భాగస్వామ్యం మా కమ్యూనిటీ, కస్టమర్‌లకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను అందిస్తుందన్నారు.   ఒమన్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ సీఈఓ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ వహైబీ మాట్లాడుతూ.. అల్ మౌజ్ మస్కట్‌తో మా భాగస్వామ్యం అల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి అధిక-నాణ్యత, పోటీతత్వ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను అందించడంలో కీలకమైనదని పేర్కొన్నారు.   ఈ ఒప్పందం అల్ మౌజ్ మస్కట్ 19,000+ నివాసితులకు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com