సౌదీలో అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశం

- November 11, 2024 , by Maagulf
సౌదీలో అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశం

రియాద్: పాలస్తీనా సమస్యను పరిష్కరించడం కోసం ఇంకా ఇజ్రాయెల్ దాడులను ఆపడం కోసం సౌదీ అరేబియా ఈరోజు అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. కింగ్ సల్మాన్ ఆదేశాలతో మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు పాలస్తీనా మరియు లెబనాన్‌లలో తీవ్రమవుతున్న సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. రియాద్‌లో జరిగిన ఈ సదస్సులో గల్ఫ్ దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు పాల్గొన్నాయి.

ఇటీవల గాజా, లెబనాన్, ఇరాన్ వంటి ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ద్వారా పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించడం జరిగింది. ఇంకా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవడం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేయడం వంటి అంశాలపై చర్చించారు. గత సంవత్సరం జరిగిన అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రధానంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించడం, లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను వ్యతిరేకించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా చర్చించారు.

సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం, పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవడం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేయడం వంటి ముఖ్య నిర్ణయాలను తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com