అక్రమ క్యాంపింగ్ సైట్లను తొలగించిన కువైట్ మునిసిపాలిటీ
- November 12, 2024
కువైట్: నవంబర్ 15 అధికారిక క్యాంపింగ్ సీజన్‌కు ముందు కువైట్ మునిసిపాలిటీ రంగంలోకి దిగింది. దేశంలోని ఉత్తర ప్రాంతాలలో 23 అనధికార శిబిరాలను కువైట్ మునిసిపాలిటీ తొలగించింది. అల్-జహ్రాలో క్యాంపింగ్ సీజన్ అధికారిక తేదీని పాటించని శిబిరాలను పర్యవేక్షణ బృందం తొలగించడం ప్రారంభించిందని మున్సిపాలిటీ తెలిపింది. అధికారిక సీజన్‌కు ముందు ఎటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కువైట్ మునిసిపాలిటీ నిబంధనలను అమలు చేయనివారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని క్యాంపింగ్ ప్రాంతాలలో ప్రత్యేక బృందాలు పర్యాటిస్తున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







