సెవెన్ స్పోర్ట్స్‌లో 'ఐ యామ్ టాలెంటెడ్' ప్రోగ్రామ్..రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

- November 12, 2024 , by Maagulf
సెవెన్ స్పోర్ట్స్‌లో \'ఐ యామ్ టాలెంటెడ్\' ప్రోగ్రామ్..రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ స్పోర్ట్స్ కమిటీ "ఐ యామ్ టాలెంటెడ్" కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ఇటీవల ఒమన్‌లో గల్ఫ్ మహిళల స్పోర్ట్స్ హ్యాకథాన్ అవార్డును గెలుచుకుంది. ఒలింపిక్ సాలిడారిటీ మద్దతుతో ఈ కార్యక్రమం వివిధ క్రీడలలో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించనున్నారు.బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ బోర్డు సభ్యుడు, స్పోర్ట్స్ కమిటీలో జెండర్ ఈక్వాలిటీ ఛైర్ అయిన డాక్టర్ షైఖా హెస్సా బింట్ ఖలీద్ అల్ ఖలీఫా మాట్లడుతూ.. సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్ H.H. షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యూత్ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ప్రెసిడెంట్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సాకారం చేయడంలో కీలకమైన మద్దతు అందిస్తున్నాయని తెలిపారు.

"ఐ యామ్ టాలెంటెడ్" ప్రోగ్రామ్ వ్యక్తిగత, టీమ్ క్రీడలలో మంచి ప్రతిభను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపిక చేయబడిన క్రీడాకారులు వారి శారీరక, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి క్రీడా సమాఖ్యలు, క్లబ్‌లతో సమన్వయంతో ఏడాది పొడవునా శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో అథ్లెట్ల పురోగతి, సంసిద్ధతను ట్రాక్ చేయడానికి సంబంధిత క్రీడా సంస్థలతో క్రమమైన మూల్యాంకనాలను చేపడుతున్నారు.  

6-14 సంవత్సరాల వయస్సు గల యువ క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని, ప్రోగ్రామ్ ఏడు క్రీడలను కవర్ చేస్తుంది: మూడు వ్యక్తిగత విభాగాలు-ఫెన్సింగ్, సెయిలింగ్, కరాటే.. నాలుగు టీమ్ క్రీడలు-ఫుట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్. ఈ కార్యక్రమం యువతోని కొత్త ప్రతిభను పెంపొందిస్తుందని, బహ్రెయిన్ జాతీయ జట్లను తాజా సామర్థ్యంతో సుసంపన్నం చేస్తుందని కమిటీ భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com