యూఏఈలో తరచుగా భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?

- November 12, 2024 , by Maagulf
యూఏఈలో తరచుగా భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?

యూఏఈ: యూఏఈ పెద్ద భూకంపం జోన్‌లో లేనప్పటికీ, అది అప్పుడప్పుడు చిన్నపాటి భూ ప్రకంపనలకు గురవుతుంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి దగ్గరలో ఉన్నందునే తరచూ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్, ఇరాక్ గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణి తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను సృష్టిస్తుందని యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) సీస్మిక్ మానిటరింగ్ సెక్షన్ యాక్టింగ్ హెడ్ మహమ్మద్ అల్హస్సానీ తెలిపారు.   తరచూ తేలికైన భూప్రకంపనలు వస్తున్నప్పటికీ 2002లో ఫుజైరాలోని మసాఫీ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో అతిపెద్ద భూకంపం నమోదైనట్లు తెలిపారు.  సాధారణంగా భూకంప నష్టం వివిధ వేరియబుల్స్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, భూకంప తీవ్రత 4 లేదా 5 కంటే ఎక్కువగా ఉండే వరకు సాధారణంగా నష్టం జరగదని తెలిపారు. భూకంపాలు సంభవించే ముందు వాటిని అంచనా కష్టమని వెల్లడించారు.   "భూకంపాలను ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు. అది జరిగితే తప్ప. కానీ కొన్ని ప్రాంతాలు భూకంప యాక్టివ్ గా ఉన్నాయని భౌగోళిక అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవించవచ్చు, అయినప్పటికీ ఈ సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం. మేము తరువాత విశ్లేషణ మాత్రమే చేయగలము. ఇది మా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించి చేయబడుతుంది. అందువల్ల, కేంద్రం నిరంతర పర్యవేక్షణ, రియల్ టైమ్ డేటా విశ్లేషణపై ఆధారపడుతుంది. ’’ వివరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com