యూఏఈలో వేలాది దిర్హామ్‌లను చోరీ చేసిన 'బిట్‌కాయిన్' హ్యాకర్లు..!!

- November 13, 2024 , by Maagulf
యూఏఈలో వేలాది దిర్హామ్‌లను చోరీ చేసిన \'బిట్‌కాయిన్\' హ్యాకర్లు..!!

యూఏఈ: బోగస్ బిట్‌కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్ ను నమ్మిన అబుదాబి నివాసితోపాటు తన ఫాలోవర్లు వేలాది దిర్హామ్‌లను కోల్పోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన ఫ్రాడ్స్ పదివేల డాలర్లను స్కామ్ చేశారు. పాలస్తీనియన్ కెనడియన్ ప్రథమ చికిత్స ట్రైనర్ తమీమ్.. కొన్ని సంవత్సరాల క్రితం లండన్‌కు వెళ్లిన పాత స్నేహితుడి సోదరుడి నుండి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ అందుకున్నారు. "అతను బిట్‌కాయిన్‌లలో పెట్టుబడి పెట్టాలని నాతో మాట్లాడాడు. అతను నా కోసం ఒక ఖాతాను తెరుస్తానని, నా ఫోన్‌కు కోడ్ వస్తుందని, దానిని తెలపాలని చెప్పాడు." అని ఆమె గుర్తుచేసుకుంది. తాను అతనితో ఇన్‌స్టాగ్రామ్ చాట్ బాక్స్‌లో కోడ్‌ను పంచుకున్నానని, వెంటనే తన ఖాతా లాక్ అయిందన్నారు. తాను అతని సోదరికి ఫోన్ చేసి అడగగా, ఆమె తన సోదరుడి అకౌంట్ కూడా హ్యాక్ అయిందన్నారని తెలిపారు. ఇక మరుసటి రోజు నుండి తాను లక్ష దిర్హామ్‌లను ఎలా గెలుచుకున్నాను అనే మెసేజులు వస్తున్నాయని పేర్కొన్నారు.  అలాగే తన ఫాలోవర్లకు హ్యాకర్లు బంగారు నాణేలు, నగదుతో కూడిన ఫోటోలను పంపుతున్నారని తెలిపారు.

రెండు వారాల పాటు, తమీమ్ తన ఖాతాను తిరిగి పొందడానికి ప్రయత్నించారు. అయితే ఆమె హ్యాకర్ ముగ్గురు బాధితులను ట్రాప్ చేసి ఒక్కొక్కరి వద్ద నుంచి 10,000 దిర్హామ్‌లకు పైగా చోరీ చేశారు. మరో స్నేహితురాలి వద్ద నుంచి $30,000,  మరో బాధితురాలి నుండి 2000 డాలర్లు,  మరో మహిళ 30,000 దిర్హామ్‌లు చెల్లించి మోసపోయారని వివరించారు.  అబుదాబి పోలీస్‌లోని సైబర్ క్రైమ్ సెక్యూరిటీ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అలీ అల్ నుయిమి మాట్లాడుతూ.. కాన్ ఆర్టిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com