ట్రాఫిక్‌ కష్టాల నుండి ఉద్యోగులకు విముక్తి.. వర్క్-ఫ్-హోమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్..!!

- November 13, 2024 , by Maagulf
ట్రాఫిక్‌ కష్టాల నుండి ఉద్యోగులకు విముక్తి.. వర్క్-ఫ్-హోమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్..!!

దుబాయ్: దుబాయ్‌లోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కలిగించేందుకు ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలు వర్క్-ఫ్-హోమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్ ను అమలు చేస్తున్నాయి.  కొన్ని ప్రైవేట్ సంస్థలు సమయాన్ని ఆదా చేయడానికి, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సిబ్బందిని పగటిపూట ఏ సమయంలోనైనా ఎనిమిది గంటల షిఫ్టుల కోసం పని చేయడానికి అనుమతిస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ అవర్స్, రిమోట్ వర్క్ అమలు చేయడం వల్ల దుబాయ్‌లో ఉదయం ప్రయాణ సమయాన్ని 30 శాతం తగ్గించవచ్చని అధికారులు నిర్వహించిన అధ్యయనాలు తెలిపాయి.  

“IT సెక్టార్‌లో పని చేయడం వల్ల నాకు ఇంటి నుండి పని చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది. అయితే అమెరికా టైమ్ జోన్‌ల ప్రకారం నా షెడ్యూల్‌ను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా రాత్రి వరకు ఎక్కువ పని గంటలు పనిచేస్తాను. ఫ్లెక్సిబిలిటీ కారణంగా నా కుటుంబంతో గుడిపేందుకు సమయం దొరికింది. ”అని దుబాయ్ లో పనిచేసే ఐటీ ఎంప్లాయ్ మైనక్ సేన్‌గుప్తా అన్నారు. మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలివర్ కోవల్స్కీ  మాట్లాడుతూ..తాము కూడా ఉద్యోగుల కోసం వర్క్-ఫ్-హోమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్ ను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు  తెలిపారు. తమ ఉద్యోగులు ట్రాఫిక్‌ను నివారించడంలో సహాయపడటానికి తాము అనేక చర్యలు తీసుకున్నామని SHRM మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ అరోరా చెప్పారు. వారు ఉదయం 8 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు ఎప్పుడైనా పని చేయవచ్చన్నారు. అలాగే నాలుగు-రోజుల ఆన్-సైట్ డ్యూటీ, ఒక-రోజు రిమోట్ వర్క్ హైబ్రిడ్ సెటప్‌ను పాటించే అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు.

 గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్, యూఏఈలో జనాభా పెరుగుదల కారణంగా ట్రాఫిక్ అనూహ్యంగా పెరిగింది. 2021-22 గణాంకాలతో పోలిస్తే సగటున ఉద్యోగులు రోడ్లపై దాదాపు రెట్టింపు సమయాన్ని వెచ్చిస్తున్నారని అరోరా చెప్పారు. ఇది వారి పని-జీవిత సమతుల్యత, మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని కోవల్స్కీ అంగీకరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com