కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం
- November 13, 2024
హైదరాబాద్: డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ కి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. మొట్టమొదటి మా ప్రస్థానం హైటెక్ సిటీ నందు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదగా మాక్స్ క్యూర్ ప్రాంభించడం జరిగింది.తదనంతరం మెడికవర్ హాస్పిటల్స్-స్వీడిష్ (యూరోపియాన్) కంపెనీ వారికీ మెజారిటీ స్టేక్ ఇవ్వడం జరిగింది. 4 రాష్ట్రాలలో తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో మేము సేవలను అందిస్తున్నాం.మొత్తం మా 24 హాస్పిటల్స్ ఆయా సందర్భాలలో ఎవరెవరు అధికారంలో ఉన్నారో వారిచేత మేము ప్రాంభించడం జరిగింది.ఒక ప్రపంచ ప్రసిద్ధ ఆరోగ్య సంస్థగా, మెడికవర్ 13 దేశాలలో సేవలందిస్తోంది.వీటిలో జర్మనీ, స్వీడన్, పోలాండ్, టర్కీ, బెలారస్, బల్గేరియా, జార్జియా, హంగేరీ, రొమేనియా, సెర్బియా, మోల్డోవా, ఉక్రెయిన్ మరియు భారతదేశం ఉన్నాయి. భారతదేశంలో, మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రధాన సేవలతో అందుబాటులో, ప్రతి సంవత్సరం కోట్లాది మంది రోగులకు వైద్య సేవలను అందిస్తోంది.మేం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సహాయం అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాము.ప్రజల ఆరోగ్యం కోసం మేం సదా కృషి చేస్తూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్తున్నాము, కానీ ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు.మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ,రామోహన్ నాయుడు,శరద్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖులు మరియు ఆధ్యాత్మిక నాయకుడు చినజీయర్ స్వామి వంటి గొప్ప వ్యక్తులచే ఆసుపత్రులు ప్రారంభించబడడం మాకు గౌరవప్రదం. వీరితో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఎల్లా వేళల ముందుంటాం అని అన్నారు.అలాగే, మేము స్పష్టంగా తెలియజేయదలిచినది ఏమిటంటే, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్నం శరత్ రెడ్డి మాక్స్బీన్ ఫార్మాలో డైరెక్టర్ కాదని తెలియజేయదలిచినాము.దయచేసి దీన్ని గమనించగలరు.మెడికవర్ హాస్పిటల్స్ గురించి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి.ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కృష్ణ-మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మ్యానేజింగ్ డైరెక్టర్, ఇండియా,డాక్టర్ అన్నం శరత్ రెడ్డి-డైరెక్టర్ & హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







