ది రానా దగ్గుబాటి షో..అమెజాన్ ప్రైమ్ లో కొత్త షో
- November 14, 2024
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్ గా, బిజినెస్ మెన్ గా బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే రానా నెంబర్ 1 యారి అనే టాక్ షోతో మెప్పించాడు. తాజాగా రానా మరో కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త షో మొదలుకానుంది. పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయాయి. వాటికి గెస్టులుగా ఆర్జీవీ, రాజమౌళి లాంటి స్టార్స్ వచ్చినట్టు సమాచారం. తాజాగా దీని గురించి అమెజాన్ అధికారిక ప్రకటన ఇచ్చింది. "ది రానా దగ్గుబాటి షో" అనే టైటిల్ తో ఈ కొత్త టాక్ షో రానుంది. నవంబర్ 23 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ షోకి రానానే నిర్మాత. మరి ఈ కొత్త టాక్ షో ది రానా దగ్గుబాటి షో ఎలా ఉంటుందో, సినీ సెలబ్రిటీలు ఎన్ని ఆసక్తికర విషయాలు చెప్తారో చూడాలి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







