శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి నిమిషంలోనే దర్శన టిక్కెటు
- November 14, 2024
తిరుమల: తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభం అయింది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.
వెంకయ్య చౌదరి వివరించారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్‌ను కేటాయించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడేవారని చెప్పారు. వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి.. ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని వ్యాఖ్యానించారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు వివరించారు.
గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు అడిషనల్ ఈవో వివరించారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని చెప్పారు.
ఈ-డిప్ రిజిస్ట్రేషన్..
అంగప్రదక్షిణం సేవా టిక్కెట్ల ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు.. ఇవాళ ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. ఆసక్తి ఉన్న భక్తులు ఆ సమయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. సమయం దాటితే రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం తిరుపతి అర్బన్, రూరల్, తిరుమల స్థానికుల కోసమేనని వివరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







