బ్రిటన్‌కు కొత్త ప్రధాని అక్టోబరులో
- June 24, 2016
విడ్ కామెరాన్ లండన్: బ్రెగ్జిట్ తీర్పు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటన చేశారు. బ్రెగ్జిట్‌పై ప్రజా తీర్పును గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరమని అభిప్రాయపడిన కామెరాన్ అక్టోబరులో బ్రిటన్‌కు కొత్త ప్రధానమంత్రి వస్తారని పేర్కొన్నారు.
దేశాన్ని ప్రేమిస్తున్నా: కామెరాన్ బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆయన భార్య సమంతాతో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రస్తుతం యూరోప్‌లో బ్రిటన్ పాత్రపై చర్చలు జరిపేందుకు బలమైన విశ్వసనీయమైన నాయకత్వం అవసరం. నేను బ్రిటన్ ప్రధానిని అయినందుకు గర్విస్తున్నాను.. నేను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నాను.. వచ్చే మూడునెలల పాటు ఈ పదవిలో కొనసాగుతా. అక్టోబర్‌లో జరిగే కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నా అభిప్రాయానికి భిన్నంగా బ్రిటన్ ప్రజలు తీర్పునిచ్చారు.. ఇప్పుడు ఇంకా నేను బ్రిటన్ నాయకుడిగా ఉండటం సరికాదు' అని కామెరాన్ పేర్కొన్నారు.
బ్రెగ్జిట్‌పై జరిగిన రిఫరెండంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడంవైపే బ్రిటిష్ ప్రజలు మొగ్గుచూపారు. రిఫరెండానికి ముందు బ్రెగ్జిట్‌కి వ్యతిరేకంగా ఓటు వేయాలని కామెరాన్ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణించే విమానం నుంచి దూకాలని ప్రయత్నించకండి, మళ్లీ ఎక్కడం అసాధ్యం.. ఈయూనుంచి ఒక్కసారి వైదొలగితే అపార నష్టం వాటిల్లుతుందని కామెరాన్ ప్రజలను హెచ్చరించారు. కానీ ప్రజలు ఆయన మాటలు వినలేదు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో కామెరాన్ పై ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









