OMR 9.99కే మస్కట్ –సలాలా మధ్య విమాన ప్రయాణం..!!

- November 14, 2024 , by Maagulf
OMR 9.99కే మస్కట్ –సలాలా మధ్య విమాన ప్రయాణం..!!

మస్కట్: ఒమన్ తక్కువ-ధర విమానయాన సంస్థ సలామ్ఎయిర్.. మస్కట్ -సలాలా మధ్య ప్రయాణానికి తన అత్యంత తక్కువ ఛార్జీలను ప్రకటించింది. వన్-వే లైట్ ఫేర్ కోసం OMR 9.99 నుండి మొదలవుతుంది. ఈ ధర డిసెంబర్ 1, 2024 నుండి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త ప్రారంభ ఛార్జీలు పరిమిత-కాల ప్రమోషన్ కాదని, సలామ్ ఎయిర్ సరసమైన సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడానికి కొనసాగుతున్న నిబద్ధతలో శాశ్వత అడుగుగా పేర్కొన్నారు. అతి తక్కువ ఛార్జీలను అందించడం ద్వారా సలామ్ ఎయిర్ మస్కట్ - సలాలా మధ్య ప్రయాణాన్ని ప్రోత్సహించడం, అందరికీ అందుబాటులో ఉండేలా విమానాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని సలామ్ ఎయిర్ సీఈఓ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ అన్నారు. ప్రయాణికులు సలామ్ ఎయిర్ వెబ్‌సైట్, SalamAir.com లేదా మొబైల్ యాప్ ద్వారా డిసెంబర్ 1 నుండి మస్కట్ నుండి బుకింగ్ చేసుకోవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com